|
పెట్టుబడిదారులు | ||||||||||
|
సికోయా క్యాపిటల్
ఇండియా
(Sequoia
Capital India)
ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలను ప్రోత్సాహించే పెట్టుబడిదారులు గురుజి డాట్ కామ్ కు అవసరమైన నిధులను పెట్టుబడిగా సమకూర్చినవారు సికోయా క్యాపిటల్ ఇండియా(Sequoia Capital India). సుమారు 750 మిలియన్ల డాలర్ల మూలదనం వీరి ఆదీనంలో ఉంది. భారతదేశంలో అతివేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న గృహవినిమయ సేవలు, వినియోగదారుల ఇంటర్నెట్, వైర్ లెస్, సోర్సింగ్ సేవలు, ఇంకా తమతమ వ్యాపారరంగాలలో అగ్రగాములుగా ఉన్న ఎన్నో వ్యాపారసేవల పైన ఈ మూలధనం ముఖ్యంగా వినియోగించబడుతుంది. వీరి కార్యాలయాలు బెంగళూరు మరియు అమెరికా లోని సిలికాన్ వ్యాలీలలో ఉన్నాయి. సికోయా క్యాపిటల్ భారతదేశ విభాగము పెట్టుబడి పెట్టిన సంస్థలలో ఆప్ ల్యాబ్స్, భారతి టెలిసాఫ్ట్, కెఫె కాఫీడె, గ్లోబల్ లాజిక్, ఇండియా టైమ్స్, ట్రావెల్ గురు, షాది డాట్ కామ్. సికోయా క్యాపిటల్ అంతర్జాతీయంగా, గూగుల్, యాహూ, యుట్యూబ్, ఆపిల్ కంప్యూటర్స్, ఒరాకిల్, సిస్కొ సిస్టమ్స్ సంస్థలలో మొదటిదశలోనే పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు. సికోయా క్యాపిటల్ గురించి మరిన్ని వివరాలు కోసం www.sequoiacap.com వెబ్ సైట్ ను చూడండి. |